Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

50లో 29 మనవే

అత్యంత కాలుష్యభరిత నగరాలు ప్రపంచంలో 50 ఉండగా 29 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. అలాగే దిల్లీ అత్యధిక కాలుష్య నగరాల్లో 4వదని ప్రపంచ వాయునాణ్యత నివేదిక 2022 తెలియజేసింది. ఈ సంస్థ వెలువరించని 5వ నివేదిక ఇది. కరోనా కాలంలో లాక్‌డౌన్‌వల్ల వాహనాలు, పరిశ్రమలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంలో వాయు కాలుష్యం తగ్గింది. ఈ నేపధ్యంలో భారతదేశం అధిక కాలుష్యనగరాల్లో 8వ స్థానంలోఉంది. 2021 లో 5వస్థానంలో ఉన్న మనదేశం బాగామెరుగై 8వస్థానానికి చేరుకుంది. తొలినుంచి అమెరికా, చైనా తర్వాత కాలుష్యం పెరిగింది మన దేశమే. గాలిలో క్యూబిక్‌ మీటరుకు 2.5మి.గ్రా సగటున పరిమాణంలో ధూళి కణాలున్నట్లుగా నమోదైంది. దిల్లీలో వార్షిక సగటు ధూళికణాలు గాలిలో క్యూబిక్‌ మీటరుకు 92.6 మైక్రో గ్రాములు (పరిమాణం 2.5 మిల్లీ గ్రాములు) ఉంటున్నదని తాజా నివేదిక పేర్కొంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌ నగరం (92.7 మైక్రో గ్రాములు) తర్వాత స్థానంలో దిల్లీ ఉంది. చైనాలోని హోటన్‌ నగరంలో 94.3మైక్రో గ్రాములు, మన దేశంలోని రాజస్థాన్‌ రాష్ట్రం భివాండి నగరంలో 92.7 మైక్రో గ్రాముల ధూళి కణాలు ప్రతి క్యూబిక్‌ మీటరుకు ఉన్నాయని నమోదైంది. 2021లోనూ దిల్లీ క్యూబిక్‌ మీటరుకు 96.4మైక్రోగ్రాముల ధూళికణాలు 2.5 మైక్రోగ్రాములు పరిమాణంలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్థారించిన ధూళికణాల స్థాయి క్యూబిక్‌ మీటరుకు 5మైక్రోగ్రాములు మాత్రమే. 2021 వరకు దిల్లీ ప్రపంచంలోనే అత్యంత అధిక కాలుష్యనగరంగా నమోదైంది. వరుసగా 4సంవత్సరాల పాటు దిల్లీనే అత్యంత కాలుష్య నగరంగా నివేదిక పేర్కొంది. ప్రాంతీయ కాలుష్య నగరాలలో రెండవ పెద్ద కాలుష్యనగరంగా దిల్లీ నిలిచింది. న్యూదిల్లీలో దిల్లీ ప్రాంతం కొంచెం తక్కువ కాలుష్యంతో ఉన్నదని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ పరిశోధనా కేంద్రం ఎగ్జికూటివ్‌ డైరెక్టర్‌ అనుమిత చౌదరి తెలిపారు. దిల్లీలో కాలుష్యానికి కారణం మీరంటే మీరని కేంద్రం, దిల్లీప్రభుత్వం వివాదం పడుతున్నాయి. కొన్ని పదుల,లక్షల వాహనాలు నిత్యం తిరగడం, పరిశ్రమలనుండి వెలువడేకాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యా నికి కారణమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రధానంగా పూనుకోవలసి ఉంటుంది. వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోసవ్యాధులు, చివరకు కేన్సర్‌వంటివ్యాధులు చోటుచేసు కుంటున్నాయి. అపరిమిత కాలుష్యంవల్ల ఉత్తర భారత దేశంలోని అనేక నగరాలు గంగాతీర ప్రాంతంలోని పట్టణాలు, నగరాలు ఎక్కువగా కలుషిత మవుతున్నాయి. ఫలితంగా ప్రజలఆరోగ్యాలు అమితంగా దెబ్బతింటున్నాయి. ప్రభుత్వాలు, ప్రజలు మేల్కొనకపోతే పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది.
`ఎడిట్‌ డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img