Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఇక్కడి దేవతలు ఎక్కడివారు?

డాక్టర్‌ దేవరాజు మహారాజు

సాధారణ శకానికి ముందు 15001000(బిసిఇ) రుగ్వేదకాలంలో దేవుళ్లందరినీ మనిషే సృష్టించుకున్నాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేవుడికి ప్రాముఖ్యం ఎలా పెరిగిందో అర్థం చేసుకుంటే విషయం స్పష్టమవు తుంది. అలాగే, అగ్ని కూడా అతి ముఖ్యమైన దేవుడే! దేవతలకైనా లేదా తమ పూర్వీకులకైనా ఏదైనా పంపాలంటే మనుషులు దానిని అగ్నిదేవుడి ద్వారానే పంపుతుంటారు. ఇదొక విశ్వాసమే అయినా, ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే అగ్నిదేవుడికి ఎక్కడా గుళ్లు లేవు. వానదేవుడు, నీటి దేవుడు, సముద్రుడు, నదీమతల్లి ఇలా నీరు కూడా దేవతా స్వరూపమే. అగ్నిలో వేసినవి దేవతలకు లేదా తమ పూర్వీకులకు అందుతాయని ఉన్న విశ్వాసం లాగే, నీటిలో వేసినా అదే ఫలితం ఉంటుందన్న నమ్మకం జనానికి ఉంది. అగ్నిలాగానే వరుణుడు కూడా రవాణా సామర్థ్యం ఉన్నవాడు. ఈయనని ‘వరుణమిత్ర’ అని కూడా పిలుచుకుంటారు. ఉదయిస్తున్న సూర్యుని వెలుగును ఉషస్సు అని అంటారు. ఉదయానికి ముందు సూర్యుణ్ని సవితు, అంటారు. గాలి దేవుణ్ణి(తుపాను) రుద్ర అనీ, సమావేశాలు దేవుణ్ణి పుషన్‌అనీ, దేవతల సలహాదారుని బృహస్పతి అని పిలుస్తారు.

ప్రపంచానికి జ్ఞానబోధ చేశామని, తామే విశ్వగురువులమని సగర్వంగా ప్రకటించుకునే మనువాదులు కనీసం తమ దేవుళ్లను తాము సృష్టించు కోలేకపోయారు. ఈ దేశ నాగరికత కన్నా ముందే విలసిల్లిన ఈజిప్టు, గ్రీసు, బాబిలోనియన్‌ సంస్కృతుల నుంచి ఏఏ అంశాలు ఎలా స్వీకరించారో నిశితంగా పరిశీలిస్తే, అనేక విషయాలు అవగతమవుతాయి. ఒకేభూమి మీద పక్కపక్కనే వేరువేరు దేశాలలో నివసిస్తున్నప్పుడు కొన్ని అంశాలు ఇటు నుండి అటు వెళ్లి ఉంటాయి. కొన్ని అటు నుండి ఇటు వచ్చి ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడమన్నది మంచి లక్షణం. కానీ, పుచ్చుకున్నది నిజాయితీగా, హుందాగా ఒప్పుకోగలగాలి. అప్పుడే గౌరవం పెరుగుతుంది. ఈజిపు ్టసంస్కృతి నుంచి తీసుకుని, పేర్లు మార్చుకుని హిందూ దేవీ దేవతలుగా స్థిరపరచుకున్న కొన్ని పురాణ పాత్రల గూర్చి ఇక్కడ పరిశీలిద్దాం!
మన భారతదేశం మీద ఆలెగ్జాంగర్‌ దండయాత్ర చేశాడని మనం చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం. అయితే ఆయన దండయాత్ర ఇంకా దేనికి ఉపయోగపడిరది అనేది ఈ దేశంలోని మనువాదులు కప్పిపుచ్చారు. అలాంటప్పుడు ఇక మనకేం బోధిస్తారు? కానీ, వివరాల్లోకి పోతే వైదికులు ఏర్పరచుకున్న దేవుళ్ల బండారమంతా బైటపడుతుంది. చాలా విషయాలు దాచి పెట్టారు. లేదా బైటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అని అనిపిస్తుంది. అసలైతే ఈజిప్టు, గ్రీక్‌ దేవీదేవతలు, పురాణపాత్రలు అన్నీ అలెగ్జాండర్‌ దండయాత్ర తోనే ఈ భారత భూభాగం మీద దాడిచేశాయి. చొరబడ్డాయి. అలెగ్జాండర్‌ సైన్యంలో ఉన్న సైనికుల ఇష్టాఇష్టాలు, విశ్వాసాలు అన్నీ ఈ దేశానికి చేరాయి. ఇక్కడివారిమీద తప్పకుండా ప్రభావం చూపాయి. ఆ విధంగా ఈ దేశానికి దేవీ దేవతల దిగుమతి జరిగింది. స్థానికంగా ఉన్నమూల వాసులుచార్వాక ఆలోచనా విధానం మీద బలంగా దెబ్బతీశాయి. మొదటిసారి ప్రపంచానికి చాటి చెప్పిన భౌతికవాదాన్ని నాశనం చేశాయి. అయితే ఆ విషయం అర్థం చేసుకోవాలంటే తెరచిన మెదళ్లు కావాలి! విశాలమైన హృదయాలు కావాలి. పచ్చ కామెర్ల పరిశీలనలతో విషయాలు తేటతెల్లంకావు. అలెగ్జాండర్‌ దండయాత్రతో పాటు ఈ దేశంలోకి ప్రవేశించిన దేవుళ్లు ఎవరెవరో నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే ఎంతైనా కాపీ కొట్టింది కాపీ కొట్టినట్లుగానే ఉంటుందని ఒప్పుకోవాలి! రుగ్వేదకాలం నుంచి అంటే సాధారణ శకానికి 1500 ముందు నుండి (బిసిఈ) ఇంద్రుడు ఒక పురాతన దేవుడు. ఒక ప్రాకృతిక శక్తిగా పూజించారు. అందుకే ఆనాటి వైదికలు యజ్ఞయాగాలన్నీ ఆయన్ని సంతృప్తి పరచడానికే చేశారు. అలాగే సా.శ ముందు 2000(బిసిఈ) నుంచి జ్యూస్‌ ప్రస్థావన గ్రీకు పురాణాలలో ఉంది. ఈ జ్యూస్‌ను దృష్టిలో ఉంచుకునే ఇంద్రుడికి రూపకల్పన జరిగింది. జ్యూస్‌ ప్రస్తావన కవి హూమర్‌ రాసిన ఇల్లియాడ్‌ (ఒడిసి)లో కూడా ఉంది. జ్యూస్‌ లాగే ఇంద్రుడు కూడా (వజ్రాయుధం) పిడుగును ఆయుధంగా ఉపయోగిస్తాడు. వీరిద్దరూ దేవతలకే రాజులు. జ్యూస్‌ ఒలింపస్‌ పర్వతం మీద ఉంటే, ఇంద్రుడిక్కడ మేరుపర్వతం మీదుంటాడు. ఇద్దరూ స్త్రీలోలురే! జ్యూస్‌ ఆంఫిట్రియన్‌ వేషంలో అలామెన్‌ను మోహిస్తాడు. అలాగే ఇక్కడి ఇంద్రుడు గౌతముడి వేషంలో అహల్యను మోహిస్తాడు. ఈజిప్టు దేవుడు ‘రా’, గ్రీకు దేవుడు ‘హెలియెస్‌’ అలాగే ‘అపోలోల నుండి రూపం, గుణగణాలు, పొందినవాడు సూర్యుడు! సాధారణ శకానికంటే ముందు 1500 (బిసీఈ)లో మొదటిసారి రుగ్వేదంలో ఉదయిస్తున్న సూర్యుడి గురించిన ప్రస్తావన ఉంది. ఇక్కడ సూర్యుడు ఒక ఆకారమేదీ లేక ప్రాకృతిక శక్తిగా భావించారు. ఈజిప్టు సంస్కృతిలో సా.శ ముందు 2500(బిసిఇ) నుండే ‘రా’కు ఒక ఆకారం ఉంది. ఈయన భూమిని, ఆకాశాన్ని, పాతాళాన్ని పరిపాలిస్తున్న వాడు అనే భావన ఉండేది. జీవరాసులన్నింటినీ ‘రా’నే సృష్టించాడనే విశ్వాసం ఉండేది. అలాగే గ్రీకు సంస్కృతిలో సా.శ. ముందు 800(బీసీఇ) నుంచి హేలియస్‌ గురించిన ప్రస్తావన ఉంది. అతడు వెలుతురుకు, ఆరోగ్యానికి, సంగీతానికీ కారకుడు. మెరిసే కిరీటంతో నాలుగు గుర్రాల రథాన్ని ఆకాశమార్గాన నడుపుతూ వెళుతుంటాడు. కొన్ని సంస్కృతులలో ఇతణ్ని ‘అపోలో’ అని కూడా అంటుంటారు. మొదటిసారి భారతదేశంలో సూర్యుణ్ణి సా.శ ముందు 200(బిసిఇ)లో బుద్ధగయలోని మహాబోధి ఆలయంలో చిత్రించారు. ఈ చిత్రంలో సూర్యుడు 4 గుర్రాలతో ఉన్న రథాన్ని తోలుతూ ఉంటాడు. కాలక్రమంలో 4 గుర్రాలు 7 గుర్రాలయ్యాయి. వాటినే తర్వాత సప్తవర్ణాలుగా గుర్తించారు. ‘రా’ అంటే ఈజిప్టు భాషలో సూర్యుని కుమారుడు సీత్రేఅంటే సూర్యుని కుమార్తె. బౌద్ధులు రాసుకున్న రామాయణం మొదటివారి బౌద్ధ జాతక కథలలో ఉంది. దాన్ని మార్పులు, చేర్పులు చేసుకుని, వైదికులు రాసుకున్నదే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రామాయణం. దశరధుడి బిడ్డలయిన రాముడు, సీత, లక్ష్మణుణి ఆయన తన రెండో భార్య నుంచి రక్షించుకోవడానికి 12 సంవత్సరాలు హిమాలయాలకు పంపిస్తాడు. తర్వాత కాలంలో అనేక మార్పులు, చేర్పులతో భారతదేశంలో వేల రామాయణాలు రాశారు. భారత్‌కు వలసవచ్చిన తర్వాత ఆర్యులు ఈజిప్టు దేవుడైన ‘ఆటమ్‌’ను కాపీ చేసి, శివుడిగా మార్చుకున్నారు. ద్రావిడులపై దౌర్జన్యంచేసి, బలవంతంగా వారితో పూజ చేయించారు. మెడలో పాము, మోకాలి వరకు జంతు చర్మాలు, చేతిలో మూడు కొనలుగల ఆయుధంతో ఉండే ఈ ఈజిప్షియన్‌ దేవుడిపేరు ‘ఆటమ్‌’. ఈయన ఈజిప్టులో దేవతలకు తండ్రిలాంటి వాడు. నాశనంచేసే వాడిగా ప్రసిద్ధుడు. తర్వాత కాలంలో భారతదేశంలో వైదిక మతస్థులు ఏర్పరుచుకున్న శివుడికి కూడా మెడలో పాము, చేతిలో మూడు కొనలుగల త్రిశూలం, మోకాలి వరకు జంతు చర్మం ఉంటాయి. ఈయనను ‘దేవ దేవుడని’ చెప్పుకుంటారు. అంటే దేవతలకే దేవుడని అర్థం. ఇతడు కూడా ఇక్కడ నాశనం చేసే వాడే గనుక, ఇతణ్ణి ‘రౌద్రుడు’ అని పిలుచుకున్నారు.
సాధారణ శకానికి ముందు 15001000(బిసిఇ) రుగ్వేదకాలంలో దేవుళ్లందరినీ మనిషే సృష్టించుకున్నాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేవుడికి ప్రాముఖ్యం ఎలా పెరిగిందో అర్థం చేసుకుంటే విషయం స్పష్టమవు తుంది. అలాగే, అగ్ని కూడా అతి ముఖ్యమైన దేవుడే! దేవతలకైనా లేదా తమ పూర్వీకులకైనా ఏదైనా పంపాలంటే మనుషులు దానిని అగ్నిదేవుడి ద్వారానే పంపుతుంటారు. ఇదొక విశ్వాసమే అయినా, ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే అగ్నిదేవుడికి ఎక్కడా గుళ్లు లేవు. వానదేవుడు, నీటి దేవుడు, సముద్రుడు, నదీమతల్లి ఇలా నీరు కూడా దేవతా స్వరూపమే. అగ్నిలో వేసినవి దేవతలకు లేదా తమ పూర్వీకులకు అందుతాయని ఉన్న విశ్వాసం లాగే, నీటిలో వేసినా అదే ఫలితం ఉంటుందన్న నమ్మకం జనానికి ఉంది. అగ్నిలాగానే వరుణుడు కూడా రవాణా సామర్థ్యం ఉన్నవాడు. ఈయనని ‘వరుణమిత్ర’ అని కూడా పిలుచుకుంటారు. ఉదయిస్తున్న సూర్యుని వెలుగును ఉషస్సు అని అంటారు. ఉదయానికి ముందు సూర్యుణ్ని సవితు, అంటారు. గాలి దేవుణ్ణి(తుపాను) రుద్ర అనీ, సమావేశాలు దేవుణ్ణి పుషన్‌అనీ, దేవతల సలహాదారుని బృహస్పతి అని పిలుస్తారు. ఒకప్పుడు కొద్దిగా ఉన్న విష్ణు దేవుడి ప్రాముఖ్యం కాలం గడుస్తున్న కొద్దీ బాగా పెరిగింది. వివిధ అవతారాలు ఎత్తాడని చెప్పుకునే విష్ణుకు, దేశవ్యాప్తంగా ఆలయాలున్నాయి. అదంతా వేద మతస్థుల ప్రచారం, కృషి. క్రతువులలో తాగే మత్తు కలిగించే పానీయమేసోమరసం! సాధారణ శకానికి ముందు 600 (బిసిఇ)లో మొదటిసారి గ్రీస్‌లో ఎరోస్‌ ప్రస్థావన బైటపడితే, ఇక్కడ భారతదేశంలో సాధారణ శకం 200(సిఇ) శివపురాణంలో కామదేవుడు (మన్మధుడు) గురించిన ప్రస్తావన బైటపడిరది. అంటే ఎరోస్‌ను దృష్టిలో ఉంచుకునే ఇక్కడ మన్మధుడు పుట్టుకొచ్చాడని స్పష్టమవుతూ ఉంది. ఈ ఇద్దరూ ప్రేమకు సంబంధించిన దేవుళ్లు. వారు గనుక ధనుస్సులు సంధించి ఎవరిమీదైతే బాణాలు విసురుతారో, వారిలోఉన్న ఫళంగా ప్రేమ/కామం పొంగిపొర్లుతుంది. ఉదాహరణకు ఎరోస్‌, అపోలో మీద బాణం ప్రయోగించి డాఫ్నేతో ప్రేమలో పడేట్టుగా చేస్తాడు. అదే ఇక్కడ మన్మధుడు శివుడి మీద బాణం ప్రయోగించి, పార్వతితో ప్రేమలో పడేట్టుచేస్తాడు. కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img