Friday, May 3, 2024
Friday, May 3, 2024

అక్క చెల్లెమ్మలకు వరం ఆసరా

ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి

విశాలాంధ్ర -ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం పేద మధ్యతరగతి మహిళలకు వరంగా మారిందని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండ మండల కార్యాలయం ఆవరణలో ఃవైయస్సార్ ఆసరాః వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలను అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఎంతో పారదర్శకంగా నేరుగా వారి అకౌంట్లోకి నగదును బదిలీ చేస్తుంటే దీన్ని చూసి ఓర్చుకోలేని వారు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటూ కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ వరుసగా మూడో ఏడాది కూడా డ్వాక్రా రుణమాఫీకి 6 వేల కోట్ల రూపాయలు అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి జమ చేశారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 19 వేల కోట్ల రూపాయలు మహిళల రుణమాఫీకే జమా అయిందన్నారు.అక్కచెల్లెమ్మలను మహారాణులుగా చేయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం మహిళలతో కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తదుపరి 995 మహిళా సంఘాలు,9,995 మంది మహిళలకు 7 కోట్ల 57 లక్షల,47 వేల,009 రూపాయల మెగా చెక్కును మహిళలకు అందించారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల మహిళలు, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు,ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img