Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఏప్రిల్ 4నుండి శ్రీవేణుగోపాలస్వామి, శ్రీలక్ష్మీనరసింహస్వామిదేవాలయాల దశమ వార్షికోత్సవ మహోత్సవములు

విశాలాంధ్ర-సీతానగరం: మండల కేంద్రంలోని సువర్ణముఖినది తీరాన
వెలశిల్లిన బొబ్బిలి రాజుల ఆరాధ్యదైవం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంతోపాటు శ్రీలక్ష్మీ నరసింహస్వామి  ఆలయంలో దశమ వార్షిక మహోత్సవములుఏప్రిల్ 4నుండి జరుపబడునని ఆలయకమిటీ నాయకులు చెలికాని వెంకటగోపాలకృష్ణ, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు.స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీశోభకృత్ నామ సంవత్సర చైత్ర శుక్ల త్రయోదశి నుండిచైత్ర బహుళ పాడ్యమివరకు అనగా ఏప్రిల్ 4నుండి ఏప్రిల్ 7వరకు ఈమహోత్సవములు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 4న మంగళవారంనాడు నిత్యారాధనం, అష్టోత్తర కలశాభిషేకం, తిరువీధి, విశ్వక్షేనారాధన, పుణ్యావచనం, అంకురారోపణం, తీర్ధ ప్రసాద గోష్ట జరుగుతోందని చెప్పారు.5నబుధవారం నిత్యారాధనం, అగ్నిప్రతిష్ఠ, పతాకప్రతిష్ఠ తీర్ధ ప్రసాద గోష్ట, సుదర్శన నారసింహ యాగం తీర్ధ ప్రసాద గోష్ట, నిత్య హోమములు ఉంటాయని తెలిపారు.
6నగురువారం నిత్యారాధనం, నిత్య హోమములు, తీర్థ ప్రసాదగోష్ట, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, తీర్ధ ప్రసాద గోష్ట ఉంటాయని చెప్పారు.
చివరిరోజు 7నశుక్రవారంనాడు నిత్యారాధనం, నిత్యహోమములు, చూర్ణోత్సవం, వసంతోత్సవం,
సువర్ణముఖీనదిలో చక్రస్నానోత్సవం, తీర్థ ప్రసాదగోష్ట, ద్వాదశారాధనలు, పూర్ణాహుతి, ధ్వజపతాక విసర్జన, పవలింపుసేవ తీర్థ ప్రసాద గోష్ట ఉంటుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించండని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img