Monday, May 6, 2024
Monday, May 6, 2024

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం అన్యాయం

సీపీఐ మన్యం జిల్లా కార్యదర్శి మన్మధరావు
విశాలాంధ్ర,పార్వతీపురం:పోలవరం ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేయాలని,పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం అన్యాయమని సీపీఐపార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మదరావుడిమాండ్ చేసారు.సోమవారం పోలవరం ఎత్తు తగ్గించకుండా పూర్తిచేయాలని కోరుతూ పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు.ఈసందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం నేడు నిండాముంచి ప్రాజెక్టును సక్రమంగా పూర్తిచేయకుండా రాబోయేరోజుల్లో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.పోలవరంపై కేంద్రం పదేపదే అన్యాయం చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నోరుమెధపకుండా చోద్యం చూస్తోందన్నారు.ప్రాజెక్టు ఎత్తును 135అడుగులకు తగ్గించి అక్కడ 92టీఎంసీలు నిల్వఉండడంవలన మన రాష్ట్రానికి ఏరకంగాను ప్రయోజనం ఉండదని స్పష్టంచేసారు.దీనివల్ల ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఘోరంగా దెబ్బతింటాయన్నారు.రాజకీయ నాయకులు,నిపుణులంతా 156 అడుగులఎత్తు 196టీఎంసీలు నీటి నిల్వకు పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపాదించినా, కేంద్రప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు.పోలవరం ఎత్తు తగ్గించడంవలన రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, దీనిపై కేంద్రప్రభుత్వం దిగివచ్చేవరకు సీపీఐపార్టీ తరపున పోరాటాలు చేస్తామన్నారు.అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగరుగుబిల్లి సూరయ్య, ఈవినాయుడు, , కూరంగి గోపీ, పువ్వుల ప్రసాద్, వెంకటరావు, రంగారావు తదిరులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img