Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నేటినుంచి పెదబోగిలిలో శిక్షణ కార్యక్రమాలు

విశాలాంధ్ర – సీతానగరం: మండల కేంద్రములోని పెదబోగిలి గ్రామ పంచాయతీ చెత్త సంపద కేంద్రం వద్ద మంగళ, బుధ వారాల్లో రెండురోజుల పాటు చెత్తనుండి సంపద తయారు చేయుటపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈఓపిఆర్డీ కెకెకె వర్మ తెలిపారు. జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఎంపిక చేసిన పంచాయతీలనుండి సర్పంచ్, కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వ్యవసాయ, పశువైద్య సహాయకులకు,క్లాప్ మిత్రలకు శిక్షణాకార్యక్రమం జరుగుతుందన్నారు. జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, బలిజిపేట, సీతానగరం మండలాలకు చెందినవారికి శిక్షణఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img