Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతీ రైతుకు ఎస్ఎంఎస్ మెసేజ్


విశాలాంధ్ర – పార్వతీపురం : 2022-23 రబీ పంటకుసంబందించి ఈపంట నమోదు చేసుకున్న వెంటనే నేరుగా రైతుల సెల్ ఫోన్లకు ఎస్ ఎం ఎస్ మెసేజ్ వస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్ పాల్ తెలిపారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.దీనికి సంబందించి మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం పనసపెద్దికొనవలస గ్రామానికి చెందిన రైతు వివరములు వెల్లడించారు.
ee-క్రాప్ నందు బుకింగ్ నంబరు 236870856 తో గూనాపు ఉష సర్వే నెంబర్ 70-5 లో 0.2000ఎకరములలో సాగుచేసిన ఉలవలపంట నమోదుకుసంబందించి వచ్చిన మెసేజ్ చూపించారు. రైతులకు ధన్యవాదములను కూడా ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలియ జేస్తున్నట్లు ఈ ఎస్ ఎం ఎస్ మెసేజ్ ద్వారా వస్తుందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ వారికి అన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల్లో మెరుగైన అన్నిసేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. పంట వేసిన నుండి అమ్మకం జరిగే వరకు అన్ని చర్యలు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో నిర్వహిస్తున్న తీరును వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img