ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్ను తీసుకొచ్చేందుకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింఇ. ఈ చట్ట సవరణ అనుసరించి ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జి అనే కొత్త రిజిస్ట్రేషన్ నెంబరు ఇచ్చేందుకు వీలుగా మోటారు వాహనాల చట్టంలో సవరణ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతనంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ప్రత్యేక సిరీస్ ను కేటాయిస్తారు. 2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి 39 సిరీస్లో నెంబర్లు కేటాయిస్తోంది. ఇకపై నూతన రిజిస్ట్రేషన్ సిరీస్ తీసుకురావడంతో ప్రైవేటు వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు.