Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఆరోగ్యాలపై ప్రజల యొక్క అవగాహన మరింత పెంచుకోవాలి

కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. నరసింహులు

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల చక్కటి అవగాహన కల్పించుకున్నప్పుడే సుఖవంతమైన ఆరోగ్యంతో పాటు చక్కటి జీవితాన్ని పొందగలుగుతారని జిల్లా అందత్వ నివారణ రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో మధు కంటి వైద్యశాలలో ప్రపంచ ఆరోగ్య వజ్రోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహులు పలు విషయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉందని, అనారోగ్యంగా ఉన్నప్పుడే ముందుగా గుర్తించి, వైద్యుల సలహాలతో వైద్య చికిత్సలను అందించుకోవాలని తెలిపారు. శారీరక, మానసిక, సామాజికంగా ప్రజలు అభివృద్ధి చెందాలన్నారు. సమతుల్యమైన ఆహారమును తీసుకోవాలని, శారీరక శ్రమ ఉండాలని, ఆరోగ్యానికి నడవడిక కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. దురాలవాట్లకు దూరంగా ఉండాలని, చక్కటి జీవనశైలిని అనుసరించాలని వారు తెలిపారు. ఆరోగ్యం కొరకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, ప్రజలకు ఆరోగ్యం పై ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఇందుకు ఉదాహరణ కరోనా అని చెప్పవచ్చును వారు తెలిపారు. ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలిపారు. ప్రజల కొరకు ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల యొక్క సలహా, సూచనలు తప్పనిసరిగా పాటించాలని, సొంత వైద్యం చేసుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వారు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం వైద్యం విషయంలో అనేక సలహాలు సూచనలను ప్రభుత్వ వైద్య అధికారులకు ద్వారా కృషి చేయడం జరుగుతుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img