Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

స్మార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రూ.100 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ : ముంబై ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ లాజిస్టిక్స్‌ స్టార్ట్‌-అప్‌ స్మార్ట్‌ ఎక్స్ప్రెస్‌ 100 కోట్ల రూపాయల మూలధనంతో కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. ఈ రౌండ్కు ఐఐఎఫ్‌ఎల్‌ ఇండియా ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌, స్మితి హోల్డింగ్‌ ట్రేడిరగ్‌ కంపెనీ (జలాజ్‌ డానీ ఫ్యామిలీ ఆఫీస్‌) నాయకత్వం వహిస్తుంది. ప్రమోటర్‌, వ్యవస్థాపకుడు యోగేష్‌ ధింగ్రా, ఇతర సహ వ్యవస్థాపకులు కూడా ఈ రౌండ్లో పాల్గొన్నారు. రాబోయే 2 సంవత్సరాలలో రెండు విడతల్లో పెట్టుబడులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. నగరాల అంతటా విస్తరించడానికి, నిర్దిష్ట స్థాయికి చేరుకోవడానికి ముందుగా నిర్వచించిన వ్యాపార మైలురాళ్లతో ముడిపడి ఉంటుంది. బ్లూ డార్ట్‌ ఎక్స్ప్రెస్‌ లిమిటెడ్‌ మాజీ సిఎఫ్‌ఓ, సిఓఓ, సీఎస్‌ఓగా ఉన్న యోగేష్‌ ధింగ్రా ద్వారా స్మార్ట్‌ ఎక్స్ప్రెస్‌ ప్రమోట్‌ చేయబడిరది. డిహెచ్‌ఎల్‌ ద్వారా బ్లూ డార్ట్‌ కొనుగోలులో ప్రధాన పాత్ర పోషించారు. లాజిస్టిక్స్‌ రంగంలో 27 సంవత్సరాల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడు, బ్లూ డార్ట్‌ వద్ద బలమైన ఆటోమేటెడ్‌ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి అతను అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img