Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఉచిత లయన్స్ క్లబ్ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి..

క్లబ్ అధ్యక్షులు చందా నాగరాజు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లయన్స్ క్లబ్ వారికే ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు చందా నాగరాజు, కార్యదర్శి గూడూరు మోహన్ దాస్, కోశాధికారి గూడూరు రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ క్యాంపు దాతగా కీర్తిశేషులు నాగభూషణం జ్ఞాపకార్థం వారి కుమారులు జగదీష్ వ్యవహరిస్తారని తెలిపారు. పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎన్. కిరణ్ కుమార్ చికిత్సలతో పాటు ఆపరేషన్లు కూడా పట్టణంలోని ఎర్రగుంటలో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ తర్వాత ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వబడునని వారు తెలిపారు. కంటి వైద్య పరీక్షలకు వచ్చువారు ఆధార్ కార్డు,రేషన్ కార్డు, సెల్ నెంబర్ చిరునామాతో రావాలని వారు తెలిపారు. అదేవిధంగా దగ్గర, దూరం చూపు ఇబ్బందిగా ఉన్నవారు కంప్యూటర్ ద్వారా లయన్స్ కంటి ఆసుపత్రిలో వైద్య చికిత్సలను అందించి కంటి అద్దములు కూడా ఇవ్వబడును వారు తెలిపారు. గతంలో ఆపరేషన్కు ఎంపికై రానివారు కూడా ఈసారి పాల్గొనవచ్చునని అదేవిధంగా ఆపరేషన్ అయిన తర్వాత చూపు తగ్గిన వారికి తక్కువ ఖర్చుతో లేజర్ చికిత్స కూడా కలదని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణముతో పాటు గ్రామీణ పేద ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img