Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హమాలిల ఆద్వర్యంలో మే డే శ్రామికుల పండుగ వేడుకలు…

ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : శ్రామికుల పండుగ అయిన ప్రపంచ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను గుంతకల్లులో ఘనంగ జరుపుకున్నారు.సోమవారం 138వ మేడే వేడుకలకు కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మిల్లు హమాలి కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదగా ఎన్టీఆర్ కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో చెక్కభజనలు తో పండుగ వాతావరణం లో వేడుకలను జరుపుకున్నారు… ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్ ,సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు. అనంతరం మిల్లు హమాలి కాలనీ సంఘం నాయకులు డి. జగదీష్ కి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ మాట్లాడుతూ…కార్మిక దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక, కర్షక, సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికులు మేడేను ఘనంగా జరుకుంటున్నారని అన్నారు.నాడు చికాగోలో ఎగిరిన పోరు జెండా..
‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.’ అని మార్క్సిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ముందుకు నడిపించిందన్నారు. 1886కు ముందు ప్రపంచ వ్యాప్తంగా 18 గంటలు, 16 గంటల ప ని విధానాలు అమల్లో ఉండేవని అన్నారు. యజమానులు కార్మికుల శ్రమను దోచుకునేవారన్నారు. ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు మొదలుపెట్టారని తెలిపారు. అమెరికా దేశంలో చికాగో నగరంలోని గడీలలో, కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం కావాలంటూ ధర్నా మొదలుపెట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి యాజమానులు, భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టున పెట్టుకున్నారన్నారు. వందలాది మంది కార్మికులను అక్కడి భూస్వాములు చంపివేశారని తెలాపారు. ఆ రక్తపు మడుగులోంచి కార్మికుల్లో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలును తీసి కార్మిక జెండాగా పైకి ఎగురవేశారని తెలిపారు. ఆనాటి నుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. అనేకమంది తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించి శ్రమదోపిడీపై విజయం సాధించారని అన్నారు. 1886 మే 1 నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ మే డే ర్యాలీలో ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ పట్టణ మండల సహాయ కార్యదర్శులు ఎస్ఎండి గౌస్, రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర ,ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లాయప్ప,హమాలీలు చెరువు నాగన్న, రామాంజనేయులు, బండయ్య,లింగమయ్య,ఈరన్న ,బాబా ఫక్రుద్దీన్ ,చిదాంబరం,లింగ, సిపిఐ నాయకులు మల్లయ్య ,పుల్లయ్య, ఉమ్మర్ బాషా,దౌలా,షబ్బీర్,వంశికిృష్ణ, నందు,వెంకట్ నాయక్ ,ఎన్ కొట్టాల బాషా,మున్సిపాల్ నరసయ్య,దాస్ ,కొండయ్య,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img