Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఇది‘నిజం’గా కవిత్వం

పూనకం వచ్చినవాడి మల్లే ఓ ఆకాంక్షని కలగంటూ 80ల చివర్లోను, 90ల ప్రారంభంలోనూ తిరుగాడిన రోజులు. ఇక ఎంతో తొందరలో లేదు… అవిగవిగో ఆ అద్భుత రోజులు అంటూ గోడల మీద నినాదాలమై ఎగసిన రోజులు. ఇంకా రావడం లేదేమిటి అని ప్రతిరోజూ ఉదయాన్నే కాసింత నిరాశ. దాన్నించి తేరుకుని మళ్లీ కలగనడానికి, దాన్ని సాకారం చేసుకుందుకు సాహిత్యమే మా తరానికి దొరికిన ఆలంబన. అదిగో, అలాంటి వెతుకులాటలో దొరికిందే ఎర్రమందారాలు కవిత్వం. దీంతో పాటే ఈ తరం యుద్ధ కవితసంకలనం. మొదటిది నిజం పేరుతో రాసిన మాకు అజ్ఞాత కవి. రెండోది వ్యక్తులుగా కంటున్న కలను సామూహికంగా కంటూ కాగితం మీద నిప్పులు చూపించిన సంకలనం. శ్రీశ్రీ సరే, దిగంబర కవిత్వం ఉండనే ఉంది. తూర్పు రైలులో వచ్చినట్లుగా మా అగ్రహారానికి విప్లవ కథలు దిగుమతి అయ్యేవి. ఇవి చదవడం జ్వరపడడం సాధారణంగా మారిన రోజులు. అదిగో అలాంటి సమయం లోనే మళ్లీ ఈ నిజం కలం పేరుతో వచ్చిన ఎర్రమందారాలు కవిత్వం. మా ఇళ్లల్లో ఇవన్నీ మా భవిష్యత్‌ని ‘‘నాశనం’’ చేస్తున్న యుద్ధ సామాగ్రి. మావాళ్లు భయపడినట్లుగానే జరిగింది. మేం ఇంజనీర్లు కాలేక పోయాం. బ్యాంకుఆఫీసర్లుగా ఎదగలేకపోయాం. అమెరికా వెళ్లలేకపోయాం. జూబ్లీ హిల్స్‌ లోనో, మరో ఖరీదైన ప్రాంతంలోనో అద్దాల మేడల్లో సుఖ నిద్రకు దూరమయ్యాం. ఏమిటీ…అవునా…వీరిని చదవడంవల్లే బతుకులు నాశనం అయ్యాయా అంటారేమో. అవును, పెరగనిబ్యాంకు బ్యాలెన్స్‌, ఒట్టిపోని ఆవు ఇవేవీ మిగలలేదు మాకు. ుష్ట్రaఅసం ్‌శీ Gతీవa్‌ ూశీవ్‌తీవ. ఇవన్నీ సరే, మరేం సాధించావు అంటుంది ఈ లోకం. ఇదిగో లోకం కోసం కన్నీరు కార్చాలనిచెప్పిన బూడిదచెట్లపూలని మా జీవిత పూలబుట్టలో దాచు కున్నాం. ఈ నిజం అనే కవిని మా పుస్తకాల అలమారాలో ముస్తాబు చేసి మరీ దాచుకున్నాం.
‘‘పాలచన్నుల్ని పీల్చి అమ్మను చంపేసిన
నెమలి ఫించపు వైరస్‌/ నాన్ననూ మిగల్చలేదు
ఏకపత్నీ శోకగంగలో’’….
‘‘ ఆక్సిజన్‌ కరువుతో కడతేరిన/కన్నవారి దీనగుర్తులై
దేశ చరిత్రకు వన్నె తెస్తారు’’
మనిషి గురించి, మనిషితరం గురించి కన్నీరు కార్చడంలో ఉన్న తృప్తి పెరిగిన, పెరుగుతున్న బ్యాంక్‌ బ్యాలన్స్‌ లో కనిపిస్తుందా..? ఉత్తరాంధ్రకు చెందిన ఈ అమాయకపు మనిషి గార శ్రీరామ్మూర్తి… ‘‘నిజం’’గా మారగానే ఆగ్రహమూర్తిగా కనిపించడం బూడిదచెట్ల పూలంతనిజం. ఈయనేం చేయ లేదు. ఆ రోజుల్లో శివసాగర్‌ ‘‘గార్ల రైలు దాడిలోన దోచుకున్న బల్‌ రైఫిల్‌ నీకిస్త తమ్ముడా’’ అన్నారు. ఈయన ఆ రోజుల్లో ఆ రైఫిల్‌ తీసుకొచ్చి ఇచ్చే సాడంతే. 25 లేదూ 30 ఏళ్లు ఉంటాయేమో అప్పుడు. రైఫిల్‌ తెచ్చి ఇచ్చే సాహస వయసే అది. కాని ఇదేమిటీ, ఏడు పదులు దాటిన తర్వాత కూడా ఈ సంకలనంనిండా రైఫిళ్లుగుప్పించి ఇచ్చేసాడు అనుకున్నా. ఈ వయసులో సాధారణంగా తిరుపతి వెంకన్నో, సింహాచలం అప్పన్నో, చాగంటి వారి ప్రవచనమో, అథమ పక్షం షిరిడీ సాయిబాబాయే శరణ్యం అంటారుకదా వయసుడిగాక అనుకుని భంగపడ్డాను. ఈకవిత్వం ఆసాంతం చదివిన తర్వాత. వయసుడిగినా పులి చేలో మేయదు కదా… అవును… పులి గుహలోకివెళ్ల సాహసించిన వాడే పులిపిల్లను వెలికితెస్తాడు. అందుకే…
‘‘జనవిషాదాన్ని తాగి/నిషా నషాళానికంటిన
మొసళ్ల ఈతకు/ నర రక్త కొలనులు కడుతున్న
కాపాలికులను చూసి/ జాతి మూర్చపోతున్నది’’
అంటూ అకాల ప్రసవవేదనని అనుభవిస్తున్నాడు. అంతేకాదు..ఈ కవికి…
‘‘అపరాత్రిలో రాలిన చుక్క/ కలలో చేరి కలవరపెడుతుంది.
ఈ ‘‘నిజం’’ ఒక్కడికే ఇలా ఉందా…. అసలు నిజమే అలా ఉందా… అని ప్రశ్నించుకుంటే… నిజమే….ఈ కవికి, నీకు, నాకు, అతనికి, ఆమెకు, సమస్త మానవాళికి కలలు కలవరపెడుతున్నాయి. కాకపోతే…. నిద్ర నటిస్తున్న వారికిమాత్రం Aశ్రీశ్రీ ఱం ఔవశ్రీశ్రీ షఱ్‌ష్ట్ర ్‌ష్ట్రవ ఔశీతీశ్రీస లా ఉంది.
అవును చలం అన్నట్లు….దాదాపు ఐదు దశాబ్దాలుగా తనకీ, ప్రపంచానికి సామరస్యం కుదరకే ఈ నిజం అనే కవి ఇంకా అంతర్‌, బహిర్‌ యుద్ధమే చేస్తున్నారు అనిపించింది. లేకపోతే సంకలనం వెనుక అట్ట మీద ‘‘దేశాల, జెండాల ఎల్లలెందుకు’’ అనే ఆకాంక్షని వ్యక్త పరుస్తారు….? అంతేనా… ఈ సంకలనం లోపలంతా దేశం అనుభవించిన నిస్సహాయ క్షణాలను కవిత్వీకరించడమే ఉంది. అదొక్కటేలేదు… దాన్నుంచి బయటపడేందుకు చేయాల్సిన పనీ ఉంది. కన్నీటి వెనుక ఉన్న కలల రహస్యం దాగి ఉంది. అందుకే ఇది బూడిదచెట్ల పూల ‘‘జ్వాల’’ అయ్యింది.
సీనియర్‌ జర్నలిస్ట్‌, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img