Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కామ్రేడ్ మహిపతి ఓబయ్య సేవలు మరువలేనివి

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం చిన్న హోతురు గ్రామానికి చెందిన దివంగత సిపిఐ పార్టీ నాయకులు కామ్రేడ్ మహీపతి ఓబయ్య పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని ఆయన సేవలు మరువలేనివని పలువురు కమ్యూనిస్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు ఓబయ్య 32వ వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని శనివారం ఉరవకొండ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాలూకా సిపిఐ పార్టీ కార్యదర్శి జే మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు పేద ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించిన మహోన్నత వ్యక్తిని పేర్కొన్నారు పేదలందరికీ భూములు పంచాలని ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని రైతులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నో ఉద్యమాలను నడిపిన వ్యక్తిని పేర్కొన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు అండగా నిలిచిన వ్యక్తి ఓబయ్య పేదల పక్షపాతిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన జీవితాన్ని పేదల కోసమే అంకితం చేశారన్నారు. గ్రామ సర్పంచ్ గా పనిచేస్తూ ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి అని ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తిని కొనియాడారు. ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శివన్న, రామాంజనేయులు తాలూకా ఏ ఐ టి యు సి తాలూకా అధ్యక్షులు చెన్నారాయుడు, కామ్రేడ్ మహిపతి ఓబయ్య కుమారుడు శ్రీధర్, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్ విడపనకల్లు కార్యదర్శి రమేష్, ఉరవకొండ కార్యదర్శి మల్లికార్జున,నాగరాజు, వన్నూరమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img