Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రైవేట్ స్కూల్లో దే హావ

ప్రభుత్వ స్కూళ్లలో చతికలబడ్డ ఫలితాలు

విశాలాంధ్ర- పెనుకొండ : పేనుకొండ మండలం నందు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 9 ప్రైవేట్ పాఠశాలలు 6 నిర్వహించబడుతున్నాయని వాటిలో గత నెల జరిగిన పదో తరగతి పరీక్షలలో ప్రైవేట్ పాఠశాలలు ఫలితాలలో ముందంజలో ఉన్నాయి అందులో బాలికలదే పై చేయిగా ఉన్నది ప్రభుత్వ పాఠశాలలు ఫలితాలలో చతికిలబడి నామమాత్రమైన పర్సంటేజ్ తో నిలిచాయి మండల వ్యాప్తంగా ఫలితాలు చూసినట్లయితే ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 69 పరీక్షలు రాయిగా 27 మంది మాత్రమే పాస్ అయ్యారు ఉర్దూ స్కూల్లో 17 మంది పరీక్ష రాయగా పదిమంది పాసయ్యారు సెంట్రల్ స్కూల్లో 36 మంది పరీక్ష రాయగా 5 మంది మాత్రమే పాస్ అయ్యారు గర్ల్స్ హైస్కూల్ నందు 119 మంది పరీక్ష రాయగా 69 మంది మాత్రమే పాస్ అయినారు గుట్టురు హై స్కూల్ నందు 58 మంది పరీక్ష రాయగా 25 మంది మాత్రమే పాస్ అయినారు మావటూరు హై స్కూల్ నందు 34 మంది పరీక్ష రాయగా 18 మంది పాసైనారు రాంపురం హై స్కూల్ నందు 23 మంది పరీక్ష రాయిగా 11 మంది మాత్రమే పాస్ అయినారు వెంకటగిరి పాలెం హై స్కూల్ నందు 49 మంది పరీక్షకు హాజరు కాగా 29 మంది మాత్రమే పరీక్ష పాసైనారు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ నందు 29 మంది పరీక్ష రాయగా 12 మంది మాత్రమే పరీక్ష పాసైనారు ఇది ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు
ప్రవేట్ పాఠశాలల ఫలితాలపై
శాంతినికేతన్ పాఠశాల నందు 39 మంది పరీక్ష రాయగా 35 మంది పాసైనారు ఇందులో మండల వ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పాఠశాల నందు ఉన్నారు శరణ్య 594 చందన 586 స్వప్నలీ 581 మార్కులు బాస్మతి 580 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ రమణారెడ్డి తెలిపారు మిగతా ప్రవేట్ పాఠశాలలో సిద్ధార్థ పాఠశాల నందు 29 మంది కాను 28 మంది పాసైనారు ఘనగిరి పాఠశాల నందు 21 మంది కాను 18 మంది పాసైనారు బ్రిలియన్స్ పాఠశాల నందు 21 మంది కాను 20 మంది పాసైనారు గ్లోబల్ జెన్ పాఠశాల నందు 31 మంది కాను 31 మంది పాసైనారు ప్రగతి పాఠశాల నందు 50 మంది పరీక్ష రాయగా 41 మంది పాసైనారు ఈ యొక్క పాఠశాల ఫలితాలను ఎంఈఓ గంగప్ప తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img