Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పెనుబోలు విజయభాస్కర్ సేవా కార్యక్రమాలు అభినందనీయం…

విజయ భాస్కర్ యువసేన నాయకులు
విశాలాంధ్ర- ధర్మవరం : సామాజిక వేత్త పెనుబోలు విజయభాస్కర్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని యువ సేన నాయకులు విశ్వనాథ్, బిల్లే రవి, లోని కోట యూత్ తొండమల గుర్రప్ప, మనీ దీప్, పవన్, హరి లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ బలిజ సంఘం నాయకులు సామాజిక వేత్త పెనుబోలు విజయభాస్కర్ 57వ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమము, కొత్తపేట సాయిబాబా గుడి వద్ద అన్నదానం, సిద్దయ్యగుట్ట తిక్క నారాయణస్వామి, చైతన్య భక్తమండలి గొట్లూరు విశ్వశాంతి అనాధ ఆశ్రమంలో, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, పేద విద్యార్థులను ఆదుకొనుట, వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ మంచి గుర్తింపును పొందడం మాకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. పెనుబోలు విజయభాస్కర్ ను ఆదర్శంగా తీసుకొని మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరింప చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img