Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

డ్రోన్‌ ద్వారా రీ సర్వే పనులు పరిశీలిస్తున్న దృశ్యం

వైఎస్‌ఆర్‌ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో డ్రోన్‌ ద్వారా రీ సర్వే పనులను ప్రారంభించిన ఆర్డీవో శ్రీనుకుమార్‌ విశాలాంధ్ర గుడివాడ వైఎస్‌ఆర్‌ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్‌ ద్వారా సహాయంతో రీసర్వే పనులు ప్రారంభించామని ఆర్డీవో శ్రీనుకుమార్‌ అన్నారు. సోమవారం గుడ్లవల్లేరు మండలం వేమవరప్పాలెం గ్రామంలో రెవెన్యూ, సర్వే అధికారులతో కలసి రీసర్వే పనులను ఆర్డీవో శ్రీనుకుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్‌ఆర్‌ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రారంభించారన్నారు. గుడివాడ డివిజన్‌ పరిధిలో గుడ్లవల్లేరు, పామర్రు మండలాల్లోని 50 గ్రామాల్లో క్లస్టర్‌ మోడ్‌ లో డ్రోన్‌ సహాయంతో గ్రామ సరిహద్దులు, భూముల సరిహద్దులను నిర్ణయించే విధంగా రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారమన్నారు. జిల్లాలో ఫైలట్‌ ప్రాజెక్టుగా నాలుగు గ్రామాలు రీసర్వే చేపట్టగా చివరి దశలో ఉన్నాయని, గుడివాడ డివిజన్‌ పరిధిలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేయగా పనులు జరుగుతున్నాయన్నారు. క్లస్టర్‌ మోడ్‌ గుడ్లవల్లేరు మండలం వేమగుంటపాలెం లోని 59 సర్వే నెంబరు లో గల215 ఎకరాలును రీ సర్వే ద్వారా సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియను డ్రోన్‌ సహాయం తో పనులను చేపట్టామన్నారు. ఇక నుంచి ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో డ్రోన్‌ ద్వారా రీసర్వే పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.అక్టోబరు చివరి నాటికి ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తి చేస్తామన్నారు. రీ సర్వే పూర్తయిన అనంతరం సర్వేపై ప్రజలకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సంబందింత తాహశీల్థారు కార్యాలయంలో తెలియజేయాన్నారు. రీ సర్వే అనంతరం రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఐ. సర్వే నరశింహారావు, ఏడీ సర్వే సూర్యారావు, డీటీ కనకదుర్గ, మండల సర్వేయర్‌ బి.రామకృష్ణ, ఆర్‌ఐ. అక్బర్‌ఖాన్‌, ఇవోపిఆర్డీ దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img