Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అణగారిన వర్గాల కోసమే పోరు

బ్రిటన్‌ యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌
బ్రిటన్‌ : ‘మా కాంగ్రెస్‌, మా పోరాటం, మా భవిష్యత్తు’ నినాదంతో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ యువజన విభాగం వారాంతంలో 50వ కాంగ్రెస్‌ జరుపుకుంది. ఈ నేపధ్యంలో 1921లో స్థాపించిన బ్రిటన్‌ యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌ (వైసీఎల్‌) ప్రధాన కార్యదర్శి జానీ హంటర్‌ రాసిన ‘ఛాలెంజ్‌’ కథనం స్థానిక మ్యాగజైన్‌ లోప్రచురించడమైంది. రస్కిన్‌ హౌస్‌లో జరిగిన 50వ మహాసభలకు హాజరైన ప్రతినిధులకు, చర్చల్లో పాల్గొన్న సభ్యులకు శుభాకాంక్షలు, సంఫీు భావాన్ని ప్రకటించారు. కమ్యూనిస్టులుగా మనం పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యవాదులం. ప్రజాస్వామ్యంపై ప్రాథమిక విశ్వాసం ద్వారా వర్గపోరాటానికి జీవితకాలం అంకితభావంతో పనిచేస్తామని యువ కమ్యూనిస్టు లీగ్‌ తరఫున హామీ ఇస్తున్నాం. బ్రిటన్‌ కార్మికవర్గ ప్రయోజ నాలకోసం మాత్రమే కాకుండా మానవత్వంకోసం నిజమైన ప్రజాస్వామ్యానికి మేము కట్టుబడి ఉంటాం. 2021 బ్రిటన్‌లో బూర్జువా ప్రజాస్వామ్య విధానాన్ని మేము ఖండిస్తున్నాం..ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయ అధికారాన్ని బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, పెట్టుబడీదారీ ప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నారు. యువత, శ్రామికులను డబ్బుతో కొనుగోలు చేసి అణచివేసే సాంప్రదాయం ప్రస్తుత ప్రభుత్వంలో నెలకొంది.ప్రజాస్వామ్య ఆశయ సాధనాలకోసం వైసీఎల్‌ కృషి చేస్తుంది. మా సంస్థ దీపస్తంభంగా నిలబడాలి. మేము కేంద్రీకృత ప్రజాస్వామ్యం పంథాలో లెనినిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికగా కృషి చేస్తాం..రానున్న రెండేళ్లకాలంలో యువజన లీగ్‌ విధానాలు, ప్రాధాన్యతలను నిర్ణయించడం మా విధం. ప్రస్తుతం మన సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మా పార్టీ విధివిధానాలు, అంతర్జాతీయ కమ్యూనిస్టులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నియంతృత్వ విధానాలను రూపుమాపడం ద్వారా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి కట్టుబడి ఉంటాం అని హంటర్‌ పేర్కొన్నారు. కమ్యూనిస్టులుగా దేశ భవిష్యత్తు పై మాకు ఆశ ఉంది. పెట్టుబడీదారా సమాజం వ్యవస్థను నాశనం చేయడానికి ముందే సమాజం సోషలిజం స్థాయికి చేరుకోగలదనేది మా విశ్వాసం. యువ కమ్యూనిస్టుల వ్యవస్థీకృత క్యాడర్‌నుండి ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతుంది. యువ కమ్యూనిస్టులుగా సామాజిక ప్రజాస్వామ్యానికి బ్రిటన్‌లో పోరాడుతాం. మా సంస్థ చిన్నదేకానీ సోషలిజానికి చేరుకోగలదన్న ఆశ మాకుంది. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని భయపెట్టేశక్తి మాకుంది. కేవలం బ్రిటన్‌లో పనిచేసే వ్యక్తులకోసమే మాత్రమే కాకుండా ప్రపంచంలో అణగారిన వర్గాల ప్రజల విజయానికి మేము నాందిపలుకుతాం…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img