విశాలాంధ్ర/హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న థింకింక్పిక్చర్స్ లిమిటెడ్ అంతర్జాతీయ కార్యకలాపాల కోసం మార్కెట్లోకి తన వ్యూహాత్మక విస్తరణను ప్రకటించింది. ఎమిరేట్స్ యూఏఈ, వీఎఫ్ఎక్స్ పోస్ట్-ప్రొడక్షన్ రంగంలో ఓవర్-ది-టాప్(ఓటిటి)కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించడం ద్వారా కంపెనీ ప్రయాణంలో ఈ ముఖ్యమైన చర్య కీలకమైన మైలురాయిని సూచిస్తుందని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. అగ్రశ్రేణి సినిమా అనుభవాలను అందించడంలో దృఢమైన నిబద్ధతతో, థింకింక్పిక్చర్స్ లిమిటెడ్ యూఎఈకి విస్తరించాలనే నిర్ణయం సంపూర్ణంగా సరిపోయిందన్నారు. థింకింక్ పిక్చర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ కుమార్ మాట్లాడుతూ లాహోటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ విస్తరణ మా విఎఫ్ఎక్స్ అండ్ ఓటిటి ప్లాట్‌ఫారమ్ కంపెనీని ప్రారంభించడం ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి వినోద సేవలను అందించడంలో మా అంకితభావానికి నిదర్శనమని వివరించారు.