Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

రెమాల్ తుఫాన్ బీభత్సం..14 మంది మృతి

రాష్ట్రంలో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తూఫాన్ దాటికి వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది చనిపోయారు.పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కలిపి నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన కురిసింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాలు, ఈదురుగాలులకు రాష్ట్రంలో 14 మంది మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లాలో 8 మంది మృతి చెందగా.. శామీర్ పేటలో చెట్టు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మియాపూర్ లో గొడ కూలి మూడేళ్ల బాలుడు, సిద్ధిపేట జిల్లా క్షీరసాగరలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో కోళ్ల ఫారం యజమానితో పాటు అతని కుమార్తె, ఇద్దరు కూలీలు ఉన్నారు. మల్లేష్, అతని కూతురు అనూష, కూలీలు చెన్నమ్మ, రాము మృతి చెందారు. కూలీలు, చెన్నమ్మ, రాములు స్వస్థలం పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే తెలకపల్లిలో పిడుగుపాటుకు ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నందివడ్డెమాన్ గ్రామంలో కూడా ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు నాగర్ కర్నూల్, పాలెం, బిజినేపల్లి, తిమ్మాజీపేట్, చెన్నపురావుపల్లి, కల్వకుర్తి, పదర, పెద్దూరు, తూడుకుర్తి వంటి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. కీసరలో ఈదురు గాలులకు చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తిమ్మాయిపల్లి నుంచి శామీర్‌పేట వెళ్లే మార్గంలో చెట్టు విరిగిపడింది. రాంరెడ్డి, ధనుంజయరెడ్డి మృతి చెందారు. రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, ధనుంజయరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మల రామారావుగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలకు గోడ కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ములుగు మండలం క్షీరాసాగర్‌లో పౌల్ట్రీ ఫారం కుప్పకూలింది. ఇదే ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img