Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు

ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. తిరుమలరావు 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్‌టీసీ ఎండీగా నియమితులయ్యారు. గత మూడేళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. అంతకుముందు రైల్వే శాఖలో డీజీపీగా ఉన్నారు. విజయవాడ సీపీగానూ ప‌ని చేశారు. ఇక‌ గత నెలలో ఏపీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీశ్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్‌గా అవ‌కాశం ద‌క్కింది. దాంతో మే 6న ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా కొలువుదీరిన కూట‌మి స‌ర్కార్ కూడా ఆయ‌న‌నే డీజీపీగా కొనసాగించాల‌ని భావించింది. అయితే, చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన గంద‌ర‌గోళం ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం ప‌లికేందుకు వెళ్లాల్సిన‌ గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆయ‌న కాన్వాయ్ ఏకంగా 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాంతో ఆయ‌న ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి వెళ్ల‌లేక‌పోయారు. ట్రాఫిక్ అస్త‌వ్య‌స్తంగా మార‌డం ప‌ట్ల‌ గ‌వ‌ర్న‌ర్ అసహ‌నం వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై అటు ప్ర‌ధాని కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అప్పుడే హరీశ్ కుమార్ గుప్తాపై వేటు ప‌డుతుంద‌ని అనుకున్నారు. తాజాగా ప్ర‌భుత్వం అదే చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి.. సివిల్స్‌కు ఎంపికైన ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు గుంటూరువాసి కాగా.. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగంలో అధికారి కాగా.. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు. కృష్ణ నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌‌లో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్‌ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేశారు. 1989లో ఆయన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్‌. ఈ దంప‌తులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img