Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగారాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ

రేపు ఆప్‌ దేశవ్యాప్త నిరసనలు

న్యూదిల్లీ : తమ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) బహిష్కరించింది. దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ప్రధాని ఆపాలని, నిరంకుశత్వ చర్యలను మానుకోవాలని డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు బెయిలిచ్చే సమయానికి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిందని, ఇది నిరంకుశత్వానికి నిదర్శనమని దుయ్యబట్టింది. ఇదే క్రమంలో కేజ్రీవాల్‌ విడుదలకు డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ఆప్‌ ఎంపీలు ఆందోళన చేశారు. ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రభుత్వం తయారు చేస్తుంది కాబట్టి దానిని బహిష్కరించాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. దిల్లీలో ప్రజాదరణగల ముఖ్యమంత్రి, మూడుసార్లు ఘన విజయం సాధించిన నాయకుడు జైల్లో ఉన్నారని, ఈడీ కోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చింది కానీ నిరంకుశత్వ పోకడల వల్ల బయటకు రాలేకపోయారన్నారు. సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసే సమయానికి ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకుందని, కేజ్రీవాల్‌ విడుదల కోసం ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ‘మేము రాష్ట్రపతిని గౌరవిస్తాం కానీ ప్రభుత్వం రాసిన అంశాలే ఆమె ప్రసంగంలో ఉంటాయి కాబట్టి దానిని బహిష్కరించాం. దేశంలో ప్రజాస్వామ్యం గొంతు నులుపేస్తూనే ప్రజాస్వామ్యం గురించి ప్రగాల్భాలు పలకడం యాధృచ్ఛికం. పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, దిల్లీ దర్యాప్తు సంస్థలు దుర్వినియోగానికి గురవుతున్నాయి. మా విద్యా మంత్రి, ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారు. నన్ను కూడా జైల్లో పెట్టారు. అందుకోసమే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాం. రాష్ట్రపతి స్వయంగా ఏదైన కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పక హాజరవుతాం’ అని సింగ్‌ వెల్లడిరచారు. అంతకముందు ఎంపీ సందీప్‌ పాథక్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి, రాజ్యాంగం అత్యున్నతం కాబట్టి బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యాంగాన్ని తొక్కేస్తూ… న్యాయం పేరిట నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో గొంతెత్తడం అవసరమన్నారు. ఇండియా ఐక్య కూటమితో చర్చించకుండానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని ఆప్‌ నిర్ణయించిందని పాథక్‌ వెల్లడిరచారు. పార్లమెంటు ఆవరణలో ఆప్‌ ఎంపీల ఆందోళనకు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు రామ్‌గోపాల్‌ వర్మ, లాల్జీ వర్మ, జావేద్‌ అలీ ఖాన్‌ మద్దతిచ్చారు. కాగా, కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్టుకు గురైన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img