Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఏపీ సర్కార్‌కు ఊరట

అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కొత్తగా సుమారు రూ.2,665 కోట్ల సమీకరణకు అనుమతి ఇచ్చింది. మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇవ్వగా అందులో ఏపీ కూడా ఉంది. జీఎస్‌డీపీలో నాలుగు శాతం నికర రుణాల పరిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ 15 శాతం టార్గెట్‌ పూర్తి చేసింది. దీంతో ఏపీకి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి 2021- 22 త్రైమాసిక-1లో అదనపు రుణాలు పొందేందుకు అనుమతి వచ్చినట్లు అయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img