London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Thursday, October 17, 2024
Thursday, October 17, 2024

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఆయనేనా…

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈమేరకు తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్‌ ఖన్నా నియమితులు కానున్నారు.నిబంధనల ప్రకారం.. ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ.. ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తర్వాత జస్టిస్‌ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఈ ఏడాది నవంబరు 11తో ముగియనుంది. ఆ మరుసటిరోజున అంటే నవంబరు 12న జస్టిస్‌ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img