Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అను’మతుల్లేని’ ప్రచార వాహనాల పై అధికారుల కాకి లెక్కలు …

– అధికారుల తీరు పై పలు అనుమానాలు

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.23.04.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష కూటమి నేతల ప్రచార వాహనాలు పై మంగళ వారం మీడియా అడిగిన ప్రశ్నలకు, చోడవరం ఎన్నికల అధికారులు కాకి లెక్కలు ఇస్తుండటం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎం.పి., ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాలకు వినియోగించే వాహనాల పై అధికారుల్లో స్పష్టత కొరవడిందనే విషయం తేటతెల్లమవుతోంది. అను’మతుల్లేని’ ప్రచార వాహనాలు, డి.జె.సౌండ్ సిస్టమ్ తో చోడవరం, చుట్టుపక్కల గ్రామాల్లో హోరెత్తిస్తూ సాధారణ ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే రీతిలో శబ్ద, వాయు కాలుష్య0తో, ఒకే అనుమతి తో గ్రామాల్లో ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ఇష్టానుసారం పలు వాహనాలు వినియోగిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నామినేషన్లకు ముందుగానే లెక్కల్లో చూపని సొమ్మును ఎడాపెడా ఖర్చులు చేస్తూ, ఉత్తుత్తి హామీలతో ఓటర్లను, అధికారులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అడపా దడపా ఫ్లాగ్ మార్చ్, శిక్షణా సమావేశాలకే పరిమితమవుతున్న అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ అధికారులు రా(చ)జకీయ నేతలతో కుమ్మక్కుయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై తక్షణమే ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని, రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, స్వచ్ఛతగా జరిగేట్లు చూడాలని ప్రజా సంఘాలు, మీడియా డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img