Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

సాహిత్యంతో సభ్య సమాజం లో చైతన్యం కోసం కృషి చేసిన యుగ కవి … ” శ్రీ శ్రీ “

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.30.04.2024ది. ” నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను ” అంటూ “శ్రీ శ్రీ” అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు, ఏప్రిల్ 30, 1910 – జూన్ 15, 1983 మధ్య కాలం నాటి ప్రముఖ తెలుగు యుగ కవి. తన సాహిత్యంతో సభ్య సమాజం లో చైతన్యం నింపేందుకు కృషి చేసిన యుగ కవి.
1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి చేసింది. , తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని అతనికి తెలియదు. 1981లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు. ముందుమాటలో అతను ఈ విషయం స్వయంగా రాసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img