Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఆర్టీసీ బస్సు నడపాలని విజ్ఞప్తి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతూ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ విద్యార్థి ఐక్యవేదిక నాయకులు మరియు గ్రామస్తులు సోమవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ పొట్టిపాడు గ్రామం నుంచి విద్యార్థులు హై స్కూల్ కు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే గ్రామ ప్రజలు సకాలంలో ఆసుపత్రులకు వెళ్లాలన్న సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకి గురవుతున్నారని తక్షణమే ఆర్టీసీ బస్సును తమ గ్రామానికి నడపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img