Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ఎగువ భద్ర ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల రాయల సీమ ఎడారిగా మారుతుంది

సీమ ప్రజలపై విశ్వాసం ఉంటే బీజేపీ నాయకులు రాజీనామా చెయ్యాలి

ప్రాజెక్టుల్లో నీరున్నా ప్రయోజనం సున్నా

సాగునీరు ఇవ్వలేని చేత కాని ప్రభుత్వాలు

విశాలాంధ్ర-కదిరి : కర్ణాటక రాష్ట్రంలో ఎగువ భద్ర ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వలన భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని బీజేపీ నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర రావు,సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.వేమయ్య యాదవ్,అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి ఎల్ నరసింహులు లు పేర్కొన్నారు.గురువారం కదిరి పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.రాష్ట్రంలో ప్రాజెక్టుల నిండా నీరు ఉన్నప్పటికీ ఒడ్డు నున్న గ్రామాలకు త్రాగునీరు,అందుబాటులోనీ భూములకు సాగు నీరు ఇవ్వలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాలం దగ్గర పడిందని విమర్శ చేశారు. రాయల సీమ జిల్లాలకు ఇవ్వవలసిన నీళ్లు ఇవ్వకుండా ఎగువ భద్ర ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేస్తుంటే రాయలసీమ ప్రజలపై ఎనలేని ప్రేమ వలకబోసినట్లు మాట్లాడుతున్నా బీజేపీ నాయకులు కేంద్రప్రభుత్వం పై ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు.రాయలసీమ పై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలకు నష్టం చేయకుండ కర్నాటక కు నీరు ఇస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు నందు ఎమ్మెల్యే స్వార్థపూరితంగా ఇసుక తవ్వి వందలాది మంది ఇళ్ళ కోల్పోయారని నేటికీ వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. ఉమ్మడి అనంత జిల్లాలలో హెచ్ ఎల్ సి, ఎన్ ఎల్ సి కాలువల ద్వారా లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తే ఉరవకొండ, రాయదుర్గం, పామిడి, కనేకల్లు, తాడిమర్రి వరకు, కడప జిల్లా పులివెందులకు లక్ష అరవై వేల ఎకరాలకు, కర్నూలు జిల్లా లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఎగువ భద్ర ప్రాజెక్టు ఎత్తు పెంచినట్లయితే దిగువ ప్రాంతాలు రాయల సీమ జిల్లాల ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. తుంగ భద్ర ప్రాజెక్ట్ ద్వార వచ్చే మిగులు జలాలు కృష్ణానదిలో కలిసి ఎత్తి పోతల ద్వారా హంద్రీ నీవా కాలువల ద్వారా అనంతలోని జీడి పల్లి,పెనుకొండ గొల్ల పల్లి రిజర్వాయర్, పార్నపల్లి, చెర్లో పల్లి డ్యాం నుండి చిత్తూరు,రాయచోటి కుప్పం జిల్లాలకు తాగు నీరుతో పాటు కరువు తీరుతుందన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగుతుందని తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రజల చేత చీ కొట్టించుకుంటున్నారని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరం కావస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, యువకులకు ఉద్యోగాలు చూపలేదని, ఉద్యోగులను నట్టేట ముంచారని కేవలం బటన్ నొక్కి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.తాగునీటి అభివృద్ధి కోసం రైతు కూలీల అభివృద్ధి కోసం రానున్న రోజులలో భారత్ కమ్యూనిస్టు పార్టీ మహాన్నతమైన ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాజేంద్ర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సురేంద్ర చౌదరి, ఉపాధ్యక్షులు మధు నాయక్, సిపిఐ తాలూకా కార్యదర్శి కదిరప్ప, సహాయ కార్యదర్శులు రాజేష్, ఇమ్రాన్, పట్టణ కార్యదర్శి లియాకత్, సహాయ కార్యదర్శి మనోహర్, ముబారక్, ఈశ్వరయ్య, ఉపేంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img