Friday, June 2, 2023
Friday, June 2, 2023

ఘనంగా దామోదర సంజీవయ్య జయంతి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు సోమవారం దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతిని రహదారులు భవనాలు అతిథి గృహమునందు న్యాయవాది మరియు సంఘ సేవకుడు శివరామకృష్ణ అధ్యక్షతన ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయనకు నివాళులర్పించి జోహార్లతో తమ యొక్క అభిమానాన్ని చాటారు అనంతరం సమత వెంకటేష్ మాట్లాడుతూ దామోదర సంజీవయ్య ఎంతో దుర్భర జీవితం అనుభవించి ఎంతో కష్టపడి చదివి అత్యున్నత స్థానానికి ఎదిగారని దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో అవమానాలు కష్టాలు ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేదించడానికి కష్టపడి చదివి కాంగ్రెస్ పార్టీలో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను మరియు దళిత ముఖ్యమంత్రి గా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని అలాగే దళితుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్నో కార్యక్రమాల రూపకల్పన చేసిన గొప్ప మహనీయుడు అని ఆయన సేవలను పొగిడారు అలాగే శివరామకృష్ణ మాట్లాడుతూ దళితులకు వన్నెతెచ్చిన మహనీయుడని దళిత కుటుంబంలో పుట్టి బీద కుటుంబంలో పుట్టి తినడానికి తిండి లేక తన లక్ష్యాన్ని చేదించుకోవడానికి లా డిగ్రీ పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి ముఖ్యమంత్రి కాగలడని ఎంతోమందితో తన యొక్క అనుభవంతో మంత్రుల గాను ముఖ్యమంత్రిగా ను అఖిలభారత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవిలోనూ కాగలిగాడని 1972 మే 7వ తేదీన ఢిల్లీలో గుండెపోటుతో మరణించడం జరిగిందని ఆయనను స్మరించడం మనందరి బాధ్యతగా భావించాలని హైదరాబాదులో ఇప్పటికి దామోదర సంజీవయ్య ఉద్యానవనమని పేరు పెట్టారని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ గా పేరుందని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంపీడీవో నారాయణస్వామి ,దండోరా రామంజి నేయులు , నరసింహులు, మారుతి, టెంపో సీనా, ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img