Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఘనంగా స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం

విశాలాంధ్ర-తాడిపత్రి : పెద్దపప్పూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్డిటి ఆధ్వర్యంలో ఘనంగా అంత ర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం నిర్వ హించారు. మొదటగా బస్టాండ్‌ సర్కిల్‌ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో రామకృష్ణ, ఎస్టిఎల్‌ అనిత ఏటిఎల్‌ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి వ్యక్తి స్త్రీలను గౌరవించాలన్నారు. స్త్రీ లేనిదే సమాజ స్థాపన ఉండదన్నారు. స్త్రీ తోనే ప్రతి కుటుంబంలో వెలుగులుంటాయన్నారు. కావున ప్రతి ఒక్కరు స్త్రీలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆదినారాయణ మాదిగ, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img