Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

నరసాపురంలో కెనరా బ్యాంక్‌ సేవలు ప్రారంభం

విశాలాంంధ్ర -కళ్యాణదుర్గం : బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామంలో కెనరా బ్యాంక్‌ నూతన శాఖ ను గురువారం ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో 73 వ శాఖ నూతన బ్రాంచ్‌ ను కెనరా బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ లారెన్స్‌ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కెనరా బ్యాంక్‌ సేవలు అందించాలనే ముఖ్యఉద్దేశం తో ఇక్కడ బ్రాంచిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బ్రాంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బ్యాంక్‌ ఖాతాదారులు సద్వినియోగం చేసుకొవాలన్నారు. అన్ని బ్రాంచ్‌ ల మాదిరి లోన్లు సౌకర్యం,డిపాజిట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్‌ మేనేజర్‌ వై. వి. రాంప్రసాద్‌ రెడ్డి, సీనియర్‌ మేనేజర్‌ ఫణీంద్రశర్మ, ఎల్డిఎం నాగరాజు రెడ్డి, కళ్యాణదుర్గం మేనేజర్‌ జి. వి. ఆర్‌. మోహన్‌, నరసాపురం నూతన మేనేజర్‌ విజయలక్ష్మి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఫిరోజ్‌ ఖాన్‌, తుమాటి హను మంతరాయుడు, బ్యాంక్‌ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img