Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం పరిహారం చెల్లించాలి..

పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర- ధర్మవరం : నియోజకవర్గంలో ఆదివారం చెలరేగిన ఈదురుగాలులు వడగండ్ల వర్షమునకు పంటలో నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సోమవారం మండల పరిధిలోని ఉప్పు నేసిన పల్లి గ్రామానికి వెళ్లి రైతులు వేసిన పంట పొలాలను వారు పరిశీలించి, రైతులను పరామర్శించారు. రైతులతో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తమకు పంటలో జరిగిన నష్టం పై పరిహారం వచ్చేంతవరకు తాను పోరాడుతూ మీకు అండగా ఉంటానని తెలిపారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ గాలివానకు అపార పంట నష్టం వాటిల్లతే, కనీసం రైతులను పరామర్శించే దిక్కు కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సాగు చేసిన అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారని, సుమారు 20 మంది రైతులు సాగుచేసిన నోరు ఎకరాల అరటి 50 ఎకరాల బొప్పాయి నేలకొరిగి కోట్లల్లో నష్టపోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మొక్కజొన్న పంట సాగును సాగు చేసి పంటను తొలగించే సమయంలో పంట అంతా నేలమట్టం కావడం చాలా బాధాకరమని వారు తెలిపారు. రైతులు ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత నష్టపోయారు? అన్న వాటిపై పరిటాల శ్రీరామ్ రైతుల ద్వారా ఆరా తీశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు గాని ఇంతవరకు రాలేదని రైతులు తమ గోడును విన్నవించుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం విద్యుత్ మరమ్మతులను వెంటనే చేపట్టి ప్రజలకు విద్యుత్తును సరఫరా చేయాలని అధికారులను వారు కోరారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఒక రైతుకు కూడా భరోసా ఇవ్వలేకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు?. ఇప్పటికైనా అధికారులు కార్యాలయాలు వీడి క్షేత్ర సాయికి వచ్చి, జరిగిన పంట నష్టం పై నివేదికలను ప్రభుత్వానికి వెంటనే పంపి, నష్టపరిహారాన్ని ఇప్పించి, రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img