Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

పలు సైన్స్‌ నమూనాల ప్రదర్శన

విశాలాంధ్ర-తాడిపత్రి : స్థానిక విజయనగర కాలనీలో ఉన్న పద్మవాణి పాఠశాలలో మంగళ వారం పాఠశాల కరస్పాండెంట్‌ నాగ పీరయ్య, లీడ్‌ అనే కంపెనీ ఆధ్వర్యంలో ఎస్‌ఎల్సి స్టూడెంట్‌ లెడ్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ కమీషనర్‌ బి. జబ్బార్‌ మియా, ఎంఈఓ వై. నాగరాజు హాజరై ఎస్‌ఎల్సి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా విద్యార్థులు నిర్వ హించిన సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ తదితర నమూనాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనంలోనే సైన్స్‌ ఎగ్జిబిషన్‌, ఎస్‌ఎల్సి కార్య క్రమాలు లాంటివి చేయడంతో అనుభవం ఏర్పడు తుంది. రాబోవు రోజుల్లో విద్యార్థులు గొప్ప ప్రయోగాలు ప్రయోగించి దేశం ఉన్నతికి పాటు పడిన వారు అవుతారన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చడానికి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడమిస్ట్రెస్‌ కె. అలీమా హెడ మాస్టర్‌ వి. జయచంద్రా రెడ్డి, మహబూబ్‌ బాషా, నాగజ్యోతి ఉపాధ్యాయలు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img