Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

పాఠకులకు అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచండి..

జిల్లా గ్రంథాలయ కార్యదర్శి రమ
విశాలాంధ్ర-ధర్మవరం : పాఠకులకు అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచాలని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి రమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు ఆకస్మికంగా పట్టణములోని బాబు జగ్జీవన్ రామ్ నగర్లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం గ్రంథాలయంలోని పలు రికార్డులను వారు పరిశీలించారు. పాఠకుల సభ్యత్వము అధికంగా చేయాలని సూచించారు. అనంతరం గ్రంథాలయ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠకులకు గ్రంథాలయ సమయ వేళల్లో అందరూ ఉండాలని తెలిపారు. గ్రంధాలయ సమస్యలు ఏవైనా ఉన్నయెడల నా దృష్టికి తీసుకొని రావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది సత్యనారాయణ, రమణా నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img