విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్ సి పోటీలలో ఉరవకొండ మహాత్మా డిగ్రీ కళాశాల విద్యార్థులు హాకీ మరియు చెస్ క్రీడలలో ప్రతిభ కనబరచడంతో గురువారం కళాశాలలో కరస్పాండెంట్ షాజహాన్, ప్రిన్సిపల్ బసవరాజు, ఏవో కేకే ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయుడు వన్నూరు స్వామి, కళాశాల సిబ్బంది విద్యార్థులు క్రీడాకారులను అభినందించారు. హాకీలో రాముడు, చెస్ లో సాయి పన్నీంద్ర గెలుపొందడంతో వీరు ఎస్కే యూనివర్సిటీ టీంకు ఎంపికయ్యారు.