Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంవత్సరంలో ఇంటర్లో అత్యధిక ప్రతిభ కనబరిచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఇదే కళాశాలలో 1987- 89 ఇంటర్మీడియట్ చదివిన మిత్రుల బృందం ఐదు మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున నగద బహుమతిని అందజేశారు. మంగళవారం జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మమత ఆధ్వర్యంలో అత్యధిక మార్కులు సాధించిన కె దేవి బైపిసి 975, పూజిత ఎంపీసీ 910, కె గణేష్ బైపిసి 826,ఎం గణేష్ బైపిసి 826, మహేష్ ఎంపీసీ 905 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మమత మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం హర్షణీయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ ప్రసాద్ రెడ్డి తో పాటు, కళాశాల సిబ్బంది 87 బ్యాచ్ ఇంటర్ విద్యార్థుల మిత్ర బృందం పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img