Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నెలకొరిగిన విద్యుత్ స్తంభాలు.. ఆగిన సరఫరా

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఆదివారం రాత్రి వచ్చిన ఈదురు గాలికి విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఏఈఈ రమాదేవి సోమవారం తెలిపారు. ధర్మవరం నుండి హంపాపురం సబ్ స్టేషన్ వచ్చే 33 కేవీ లైన్ ఫీడర్ లో సుమారుగా 22 విద్యుత్ స్తంబాలు నేలకు ఒరిగాయన్నారు. దాని వల్ల రాప్తాడు మండలంలో ఉన్న మూడు సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయము జరిగిందన్నారు. దీంతో బుక్కరాయసముద్రం నుండి సింగల్ ఫేస్ విద్యుత్ సరఫరా చేశామన్నారు. 11కేవీ మరూరు, గొల్లపల్లి, చెర్లోపల్లి, జలబిందు ఫీడర్లలో దాదాపు సుమారుగా 45 విద్యుత్ స్తంభాలు విరిగాయన్నారు. అదేవిధంగా మరూరు, పాలవాయి, గొల్లపల్లి గ్రామాలలో 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయన్నారు. యుద్ధప్రాతిపదికన మూడు రోజుల్లో మరమ్మతులు చేసి త్రీ-ఫేస్ విద్యుత్ సరఫరా చేస్తామని అనంతపురం రూరల్ డివిజన్ ఈఈ గోపి, డీఈఈ శ్రీనివాసరెడ్డి రాప్తాడు మండలం ఏఈఈ రమాదేవి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img