Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రమాదవశాత్తు బస్సుపై విరిగిపడిన విద్యుత్‌ స్తంభం

బస్సులోని ప్రయాణికులు సురక్షితం
విశాలాంధ్ర`రోద్ధం : సత్య సాయి జిల్లా స్థానిక మండల కేంద్రంలో గురువారం ప్రమాదవశాత్తు పావడ పెనుగొండ ప్రధాన రహదారి పక్కన విద్యుత్‌ స్తంభం ప్రమాదవశాత్తు విరిగిపడి బస్సుపై పడిరది. అయితే బస్సులోని 30 మంది ప్రయాణికులు ఏ ఒక్కరికి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు మేరకు పెనుగొండ నుండి ఆర్టీసీ బస్సు పావడనుండి ఆర్టీసీ బస్సు బస్టాండ్‌ సమీపంలో వచ్చు సమయంలో విద్యుత్‌ స్తంభం బస్సు పై విరిగిపడిరదని ఆ సమయంలో విద్యుత్తు తీగలు ఒకదానిపై ఒకటి పడి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ట్రాన్స్ఫార్మెన్లో ఫీజులు పోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది బస్సులోని ప్రయాణికులకు కానీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు ట్రాన్స్‌ కో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు లైన్‌ ఇన్స్పెక్టర్‌ గోవిందప్ప సిబ్బందితో వెంటనే వచ్చి విద్యుత్‌ స్తంభం కరెంటు తీగలను తొలగించారు. అనంతరం విద్యుత్‌ మరమ్మత్తు పనులను చేపట్టి సాయంత్రం కల్లా విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img