Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మెగా ఉచిత వైద్య శిబిరానికి స్పందన

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం  శాంతారామ్ ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించారు. జడ్పిటిసి సభ్యులు తేజేశ్వరి, కురుబ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు వసకేరి రమేష్ బాబు, ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం హర్షనీయమని ఎమ్మెల్సీ మరియు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వసికేరి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గుండె, కంటి ఆపరేషన్లు మరియు మోకాలు, భుజము, మెడకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్లకు ఎంపిక అయిన వారిని కూడా గుర్తించడం జరిగిందని వారందరికీ కూడా ఆపరేషన్ కూడా చేయించడం జరుగుతుందని తెలిపారు మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వారు తెలిపారు.  వైద్య శిబిరానికి వచ్చిన అందరికీ కూడా భోజన సౌకర్యాలు కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు సభ్యులు మల్లికార్జున, గ్రామ సర్పంచ్ మోనాలిసా, మండల వైసిపి నాయకులు హనుమంత్ రెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img