Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేస్తాం… ఆర్డీవో తిప్పే నాయక్‌

విశాలాంధ్ర`ధర్మవరం : పట్టణంలోని కదిరి గేటు వద్ద రెండు వరసల రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కొరకు ప్రజాహిత కార్యాలకు ఉపయోగించే నిమిత్తం అక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేకూర్చుతామని ఆర్డిఓ తిప్పే నాయక్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులందరికీ కూడా సమావేశాన్ని నిర్వహించారు. తదనంతరం వారు మాట్లాడుతూ 130 మంది లబ్ధిదారులకు ఈనెల 17వ తేదీన భూసేకరణ నోటీసు కూడా పంపించడం జరిగిందని, అవార్డు ఎంక్వయిరీ నిమిత్తం చర్చించడం జరిగిందన్నారు. లబ్ధిదారులందరూ అవార్డు ఎంక్వైరీ కి హాజరైన తెలియపరిచిన డాక్యుమెంటరీ సాక్షాలను సమర్పించడం జరిగిందని తెలిపారు. భూ సేకరణ చట్టం ప్రకారం మీకు చెల్లించవలసిన భూమి కట్టడముల నష్టపరిహారం మీ బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని వివరాలను లబ్ధిదారులకు తెలియజేయడం జరిగిందన్నారు. లబ్ధిదారుల అభ్యంతరాలు ఏమైనా ఉన్న యెడల వాటికి సంబంధించిన అధికారుల చేత మరల విచారణ చేయబడునని, అందుకు సంబంధించిన అభ్యంతర అర్జీలు ఇవ్వవచ్చునని తెలిపారు. తదుపరి ఆనంద్‌ అనే లబ్ధిదారులతోపాటు పలువురు మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం మాకు పునరావాసం అనే మాటే లేదని, మా ఇల్లు మా స్థలము తాము ఇస్తామని, మరి మా పరిస్థితి ఏమిటని వారు విన్నవించుకున్నారు. అంతేకాకుండా పూరే గుడిసె ఉన్న వాళ్లకు ఎక్కువ డబ్బులు, భవనాలు ఉన్నవారికి తక్కువ డబ్బులు ఉన్నట్లు ఆధారంతో సహా ఆర్‌ డి ఓ కు తెలియజేశారు. అంతేకాకుండా ఈ తొలగింపు చర్యలో హిందువులకు సంబంధించిన మూడు దేవాలయాలు ఉన్నాయని,ఆ దేవాలయాలను తొలగించే ప్రయత్నాన్ని మానవతా దృక్పథంతో మానుకోవాలని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరలో చాలా తేడాలు ఉన్నాయని, నష్టపరిహారం లో కూడా అలాగే ఉన్నాయని ఆర్డిఓ దృష్టికి తెచ్చారు. తదుపరి ఆర్డీవో మాట్లాడుతూ తమకు అభ్యంతరమైన విషయాలలో ఫిర్యాదు రాత రూపేనా చేయాలని, అప్పుడే న్యాయం చేకూర్చుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమములో డీఏవో కతిన్‌ కుప్రా, తాసిల్దార్‌ నీల కంటారెడ్డి ,ఉప తహసిల్దార్‌ అంప య్య, 130 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img