Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలి

మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప
విశాలాంధ్ర`ఉరవకొండ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాల్సిన అవసరం ఉందని ఉరవకొండ మండల విద్యాశాఖ అధికారి ఎం ఈశ్వరప్ప అన్నారు. సోమవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల ప్రభుత్వ హైస్కూల్‌ ఆవరణలో జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఖో ఖో అండర్‌ 14 అండర్‌ 17 క్రీడా జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాకుండా స్నేహ సంబంధాలను కూడా పెంచుతాయన్నారు జిల్లా స్థాయి జట్లకు ఎంపికైన క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ హై స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయురాలు నాగ మంజుల, గ్రామ సర్పంచ్‌ శ్రీరాములు, విద్యా కమిటీ చైర్మన్‌ రామాంజనేయులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొరార్జీ యాదవ్‌, ఉపాధ్యక్షులు నాగరాజు, పాఠశాల, ఫిజికల్‌ డైరెక్టర్‌ మారుతి, ఎస్‌ జిఎఫ్‌ అనంతపురం కార్యదర్శి రవికుమార్‌, సత్య సాయి జిల్లా కార్యదర్శి అంజన్న మాట్లాడారు. ఈ ఎంపిక కార్యక్రమంలో అనంతపురం సత్యసాయి, జిల్లాల నుంచి 48 జట్లు పాల్గొన్నాయి క్రీడాకారులకు ప్రత్యేకంగా నాలుగు కోర్టులను ఏర్పాటు చేసి భోజన వసతి కూడా కల్పించినట్లు పిడి మారుతి తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img