Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

విద్యుత్‌ షాక్‌తో అన్నదాత దుర్మరణం

విశాలాంధ్ర`కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పులికల్లు గ్రామంలో రైతు వడ్డే రామాంజనేయులు (48)విద్యుత్‌ షాక్‌ తో దుర్మరణం పాలయ్యారు .తన నాలుగెకరాల వ్యవసాయ తోటలో పంట సాగుచేస్తున్న రైతు గురువారం ఉదయం మోటార్‌ పెట్టడానికి వెళ్ళాడు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ లో ఫీజు వేయడానికి వెళ్ళాడు. అక్కడ ఏబి స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలింది. బుధవారం రాత్రి వర్షం రావడంతో చుట్టుపక్కల తేమ ఉండడం షాక్‌ గురయ్యాడు . తీవ్ర గాయాలతో కిందపడిపోయిన రైతు రామాంజనేయులు ను తోటి రైతులు గమనించి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోగా మార్గమధ్యంలోనే రైతు తను చాలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి బోరున వినిపించారు. జిల్లాలో నెల రోజులుగా జరుగుతున్న విద్యుత్‌ ప్రమాదాలపై సదరు శాఖ అధికారుల్లో స్పందన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని రైతులు వాపోతున్నారు. నివారణ చర్యలకు ఉపక్రమించి రైతుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img