Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

సమస్యలు తీరేవరకు పోరాటాలు త్యాగాలే భారత కమ్యూనిస్టు పార్టీ నైజం

తనకల్లులో ఘనంగా 98వ ఆవిర్భావ దినోత్సవం
విశాలాంధ్ర`తనకల్లు : తనకల్లు మండల కేంద్రంలోని అంబేద్కర్‌ కూడలిలో సిపిఐ పార్టీ స్తూపం వద్ద కదిరి నియోజకవర్గ కార్యదర్శి కదిరెప్ప మండల శాఖ రైతు సంఘం ఆధ్వర్యంలో 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు పేదలకు అండ దేశ రక్షణ కొరకు ఆవిర్భవించిన సిపిఐ పార్టీ జెండాను ఎగురవేసి రెడ్‌ సెల్యూట్‌ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పెత్తందారులకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు త్యాగాలు సలుపుతూ 98వ సంవత్సరానికి నాంది పలుకుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని తనకల్లు మండల కేంద్రంలో ఈరోజు జరుపుకుంటున్నామన్నారు రైతు సమస్యలపై విద్యార్థి సమస్యలపై కార్మిక సమస్యలపై దేశ రక్షణకై సరైన నిర్ణయాలు తీసుకొని అమలయ్యే వరకు అలుపెరుగని పోరాటాలు చేస్తూ సాధించి పేదల పక్షాన నిలబడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని మున్ముందు కూడా అందరి పక్షాన నిలబడి సమస్యలకు స్పందించి పోరాటాలు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలపై అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్‌ రెడ్డప్ప రైతు సంఘం మండల కన్వీనర్‌ ఇక్బాల్‌ చౌడప్ప యాదవ్‌ కరీముల్లా శ్రీనివాసులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img