Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రైల్వేస్టేషన్లో సమస్యలు పరిష్కరించండి.. సిపిఐ నాయకులు

విశాలాధ్ర-ధర్మవరం : పట్టణములోని రైల్వే స్టేషన్లో పలు సమస్యలతో రైల్వే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఉన్నతాధికారులతో చర్చించి, న్యాయం చేయమని కోరుతూ శనివారం పట్టణములోని రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ నరసింహనాయుడు కు వినతి పత్రాన్ని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం, మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి వై. రమణ, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రాజా, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య లు అందజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ వ్యవసాయ రంగము తర్వాత చేనేత పరిశ్రమ నేడు దేశంలోనే రెండవ స్థానంలో ఉందని, ఇప్పటికే ధర్మవరం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన చేనేత పరిశ్రమగా పేరుగాంచినదని, ఇక్కడినుండే వేలాదిమంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారని, అటువంటప్పుడు వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఒక ప్లాట్ఫారం నుంచి మరొక ప్లాట్ఫారం కు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, రైల్వే వారు కలిగించే సదుపాయాల్లో భాగంగా లిస్టులు ఎక్స్లెటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యార్థం అవి 24 గంటలు పని చేసే విధంగా (రాత్రిపూట కూడా) చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా రైల్వేలో గల జి.ఆర్‌.పి పోలీసులు ఆర్పిఎఫ్‌ పోలీసుల ద్వారా ప్రయాణికులకు మరింత భద్రత, జాగ్రత్తలను ఏర్పాటు చేయాలని తెలిపారు. తదుపరి ధర్మవరం రైల్వే స్టేషన్‌ నుండి పట్టణంలోని వివిధ చోట్లకు ఆటో కార్మికులతో రైల్వే అధికారులు మాట్లాడి, ఒక నిర్ణీత ధరను నిర్ణయించి, ప్రయాణికులకు వెసలు పాటు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. స్పందించిన రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ నరసింహ నాయుడు మాట్లాడుతూ తమ సమస్యలను వెనువెంటనే ఉన్నతాధికారులకు తెలిపి, సత్వరంగా సమస్యను పరిష్కరిస్తానని వారు హామీ ఇచ్చారు. అనంతరం స్టేషన్‌ మాస్టర్‌ స్పందన పట్ల సిపిఐ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img