Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వినియోగదారుల చట్టంపై విద్యార్థుల అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ రెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : వినియోగదారుల చట్టంపై విద్యార్థులందరూ కూడా తప్పక అవగాహన కలిగి ఉంటే, మంచి ప్రయోజనం ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని కే హెచ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినియోగదారుల దినోత్సవాన్ని విద్యార్థులు, అధ్యాపకులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం కామర్స్‌ విభాగ అధిపతి పుష్పావతి ఆధ్వర్యంలో నిర్వహించాగా, ముఖ్య అతిథిగా కామర్స్‌ విభాగాధిపతి ఆరిఫ్‌ భాష హాజరు కావడం జరిగింది. తదుపరి వినియోగదారుల చట్టముపై అవగాహనతో పాటు, క్విజ్‌ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ క్విజ్‌ పోటీలలో మంచి ప్రతిభ ఘనపరిచిన బి. నందిని, ఎస్‌. గౌసియా సంయుక్తంగా రాగా, ద్వితీయ స్థానంలో జి. చక్రి, జె.వెంకట సాయి కృష్ణ, డిగ్రీ విభాగంలో ఎం రాజు కె హేమంత్‌ కుమార్‌ కె కృతిక ప్రధమ,ద్వితీయ బహుమతులను అందుకోవడం జరిగిందన్నారు. తదుపరి వ్యాసరచన పోటీల్లో ఎన్‌ హర్షిత బి మేఘ వర్షిని ప్రధమ, ద్వితీయ బహుమతులను అందుకోవడం జరిగిందన్నారు. బహుమతి దాతగా ఫిజిక్స్‌ లెక్చరర్‌ పావని వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ జీవన్‌ కుమార్‌, అధ్యాపకులు భువనేశ్వరి, పుష్పావతి, గౌతమి, రామ్మోహన్‌ రెడ్డి లతోపాటు ఆధ్యాకేతరా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img