Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

సమస్యల పరిష్కారం కోసమే.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

విశాలాంధ్ర ` రొద్దశీ : మండల పరిధిలోని చిన్నమంతురు గ్రామ పంచాయితీ మరియు నల్లూరు గ్రామ పంచాయతీ, దందేపల్లి మరియు కల్లుకుంట గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే శంకర నారాయణ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం పరిష్కార దిశగా గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామంలో తిరుగుతూ ప్రతి గడపకు ప్రతి కుటుంబానికి నవరత్న పధకాలు వివరిస్తూ లబ్ది పొందని వారికి ఎందుకు రాలేదు అని వివరిస్తూ, అక్కడే అధికారుల సమక్షంలో పరిష్కారం చూపుతూ ముందుకు సాగారు. అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీలకు వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కిట్లను అందజేసారు గ్రామాలలో సిమెంట్‌ రోడ్లు డ్రైనేజీలు ఇంటి పట్టాలు గృహ నిర్మాణము పెన్షన్ల గురించి ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావించారు వాటికి పరిష్కారం షాపు చూపుతూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ తిమ్మయ్య, ఎంపీపీ, చంద్రశేఖర్‌ , స్థానిక సర్పంచ్‌, రామక్క , ఎంపీటీసీలు , సర్పంచులు, వైఎస్‌ఆర్‌ సీపీ ముఖ్యనాయకులు నారాయణరెడ్డి రామచంద్రారెడ్డి, సూరి అనుబంధ సంఘ నాయకులు, డీలర్లు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img