Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

సాంకేతికంగా విద్యలో కొత్తపుంతలు తొక్కించేందుకే ట్యాబ్‌లు పంపిణీ

విశాలాంధ్ర- రాప్తాడు : పాఠశాలల్లో 8వ తరగతి నుంచే సాంకేతికవిద్యను కొత్తపుంతలు తొక్కించేందుకే ప్రభుత్వం ట్యాబ్‌ లు పంపిణీ చేస్తోందని ఎంఈఓ మల్లికార్జున అన్నారు. రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌ 8వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకనుక పథకంలో భాగంగా బుధవారం ట్యాబ్‌ లు పంపిణీ చేశారు. హెచ్‌ఎం బి నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా కన్వీనర్‌ జూటూరు శేఖర్‌, యూత్‌ కన్వీనర్‌ చిట్రెడ్డి సత్తిరెడ్డి, వైస్‌ ఎంపీపీ, నాయకుడు మన్నల రవికుమార్‌ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు పనుల ద్వారా పాఠశాల ఆధునికీకరణ ద్వారా సీఎం జగన్‌ విద్యను ఉన్నత స్థానంలో నిలపడానికి కృషిచేస్తున్నారన్నారు. ట్యాబులు ద్వారా ఒక నూతన విద్యా విధానం అమలుకు శ్రీకారం చుట్టారని, ఈ టాబ్లెట్‌ ద్వారా బై జ్యూస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందించడం శుభ పరిణామమన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఒక మంచి నడవడికతో తీర్చిదిద్దిప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుందన్నారు. తెలియజేశారు. టెక్నాలజీ ద్వారా విద్యార్థులు తమ జ్ఞానాన్ని ఇనుమడిరపజేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా బాటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీ ఎన్‌. కేశవమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img