Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

సియూఏపిలో జూమ్‌ ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అంతర్జాల వేదికలో సదస్సును శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమ ముఖ్య వక్త ఆచార్య ఆర్‌. గంగాధర శాస్త్రి, ప్రొఫెసర్‌, ఎస్‌ ఎస్‌ ఎస్‌ ఐ హెచ్‌ ఎల్‌ మాట్లాడుతూ మానవహక్కులు అనేవి సమాజ ప్రగతికి మూలమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి మనిషి తన బాధ్యతను నిర్వహిస్తూ తన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజ్యాంగంలో హక్కుల ప్రాధాన్యత గురించి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img