Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ వైసిపి

విశాలాంధ్ర`బ్రహ్మసముద్రం : దోపిడీలు ,భూకబ్జాలు, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ వైసిపి ప్రభుత్వమేనని రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, పట్టణ కన్వీనర్‌ శర్మాస్‌ వలి ధ్వజమెత్తారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలన అరాచకాలను అవినీతిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతికే సమయం చాలదని ప్రజా సంక్షేమం ఎలా సాధ్యమవుతుందని వారు ఎద్దేవా చేశారు . ఈ సైకో పాలన పోయి సైకిల్‌ పాలన వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దానిని ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో వైసీపీ కి తగిన బుద్ధి చెప్పాలని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్‌ చౌదరి, యువ నేత మారుతి చౌదరి, గౌని శ్రీనివాసరెడ్డి ,పూజారి ధనుంజయ, పెద్ద ఎర్రి స్వామి, పూజారి వినోద్‌, మళ్లీ పల్లి నారాయణ ,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img