Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర-శెట్టూరు : ఏపీటీఎఫ్ క్యాలెండర్ డైరీల ఆవిష్కరణ మండల విద్యాశాఖ అధికారి శ్రీ వి శ్రీధర్ జిల్లా అధ్యక్షులు రాయల్ వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యా ఉపాధ్యాయంగా అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని ఈ సంఘ సేవలు అభినందనీయమని కొనియాడారు మాట్లాడుతూ బాధ్యతలకై నిలబడు హక్కులకై కలబడు అని నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యలకు రాజీలేని పోరాటాలను సలుపుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి విద్యార్థుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సేవలందిస్తుందని ప్రభుత్వం పాఠశాల విలీనాన్ని ఆపి గ్రామీణ విద్యాభివృద్ధికి బాటలు వేయాలని సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిత్తయ్య, ప్రధాన కార్యదర్శి మురళి, ఎర్రి స్వామి, ఈరన్న, వీరారెడ్డి, రవి కృష్ణ, విజయ్ కుమార్ మోహన్ సిద్ద లింగప్ప వన్నూరు స్వామి చంద్రశేఖర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img